14, జులై 2011, గురువారం

అనంతపురం కవిత్వంతో వొక రోజు

నా కొత్త పుస్తకం 'అనంతరం' కు 10 జూలై రోజున అనంతపురం లో ఉమ్మడిశెట్టి -2010 పురస్కారం [కవి రాధేయ గారు 23 ఏళ్ళ క్రితం స్థాపించింది ] స్వీకరించాను ...ఇది నా తొలి పురస్కారం...ఇంతకు క్రితం వరకూ పురస్కారాల కోసం పుస్తకాలు పంపించడం అన్న  ఆలోచన ఎందుకో నచ్చక కొంత దూరంగా వున్నాను...సరే...ఈ సారి మాత్రం ఈ విధంగానైనా వేరే ప్రాంతంలో వున్న నలుగురు సాహిత్య మిత్రుల్ని కలవొచ్చు కదా అని నా ఆలోచనను కొంత మార్చుకున్నాను...

అనంతపురం సభ మరిచిపోలేని వొక అందమైన అనుభవం...రాధేయ గారు స్వయంగా కవి అయి వుంది కూడా, కేవలం కవిత్వం పట్లా, కవుల పట్లా ఇంత ప్రేమతో ఇన్నేళ్ళుగా ...ఇంత నిజాయితీగా ఈ పురస్కారాన్ని నిర్వహించడం అభినందనీయం...ముఖ్యంగా ...ఆ రోజు రాధేయ గారి ఇంటికి అందరమూ కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళినపుడు అనిపించింది..అభినందించావలసింది వొక్క రాధేయ గారినే కాదు...ఆయన కుటుంబాన్ని కూడా అని...మరీ ముఖ్యంగా ...అక్కడ రాధేయ గారూ, మరి కొందరు మిత్రులూ కలిసి సృష్టించిన గొప్ప సాహిత్య వాతావరణం నన్ను ముగ్ధుణ్ణి చేసింది....

ఆ రోజున రాధేయ గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనం లో చిలుకూరి దీవెన [ప్రముఖ రచయిత దేవపుత్ర గారి అమ్మాయి] ..సీమ నుంచి 'అరకు' చూడడానికి వెళ్ళిన వొక అమ్మాయి కోణం నుంచి మంచి కవిత చదివింది...అలాగే ..మరి కొందరు యువకవులు కూడా గొప్ప ప్రామిసింగ్ గా కనిపించారు...కాకపోతే...కవిత్వం తో వొచ్చిన చిక్కు ఏమిటంటే ...నాలుగు జీవం నింపుకున్న వాక్యాలని నీకు ఇవ్వడానికి, అది నీ జీవిత కాలాన్ని ఫణంగా పెట్టమంటుంది...

అనంతపురం ఆతిధ్యాన్ని మరిచిపోలేను...వీలయితే ...వొక అనంతపురం సాహిత్య సభకు మీరూ వెళ్లి రండి....!  

 రాధేయ, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, విహారి గార్లతో నేను..

4 కామెంట్‌లు:

Afsar చెప్పారు...

"కాకపోతే...కవిత్వం తో వొచ్చిన చిక్కు ఏమిటంటే ...నాలుగు జీవం నింపుకున్న వాక్యాలని నీకు ఇవ్వడానికి, అది నీ జీవిత కాలాన్ని ఫణంగా పెట్టమంటుంది..."

అది కోడూరి కలం పదును...బాగుంది, అది నాకు తెలిసీ మనకి వున్న మంచి అవార్డులలో వొకటి. నాకు వచ్చిన మొదటి అవార్డు కాబట్టి నేను కాస్త సెంటిమెంటల్ కూడా ఆ విషయంలో! ఈ సారి అనంతపురం ఫోన్ చేసినప్పుడు రాధేయకి చెప్పండి.

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@అఫ్సర్...రాధేయ గారికి చెబుతాను..తప్పకుండా!......సభలో కూడా, మీ గురించీ..దర్భశయనం గారి గురించీ ప్రస్తావించాను...
ఇక, మీరు quote చేసిన నా వాక్యాల గురించి...thanx for the complements ..
అఫ్సర్ గారూ ...నిజాయితీగా చెప్పాలంటే, ఈ నిజం అర్థం కావడానికి చాలా కాలం పట్టింది నాకు ......అందుకే, వొక్కోసారి అల్లిబిల్లిగా వున్న కొన్ని ఆలోచనలని వొక పద్యం [శివారెడ్డి గారు కవితని ఇలా పిలవడం ఎందుకు మొదలుపెట్టారో గానీ ...ఇదే బాగుంది] చేయడానికి కూర్చున్నప్పుడు ..అదేదో వేగంగా వొస్తోన్న రైలుకి ఎదురుగా వెళ్లి ఆపాలని ప్రయత్నించినట్టుగా వుంటుంది ....

ఎం. ఎస్. నాయుడు చెప్పారు...

hearty congrats koduri.

కోడూరి విజయకుమార్ చెప్పారు...

thanx Naidoo...