22, ఏప్రిల్ 2013, సోమవారం










కిటికీ తెరిచినపుడు ...



నువ్వొక నదినీ, ఆకుపచ్చని నేలనీ దర్శించాలని కలగన్నపుడు
ఒక్క కిటికీని మాత్రమే తెరిస్తే సరిపోదు

చెట్లనీ, పూవులనీ దర్శించాలని నువ్వు ఆశపడినపుడు
నువ్వు అందుడివి కాకుండా ఉండడమొక్కటే సరిపోదు

అంతే కాదు.. నువ్వొక జ్ఞానివి కూడా వుండకూడదు
జ్ఞానం లో ఆలోచనలకు తప్పపచ్చని చెట్లకూ, రంగు రంగుల పూలకూ చోటు వుండదు

ఒక్కొక్కరమూ ఒక్కొక్క గుహ మాదిరి బతుకుతూ.
ఒక మూసి పెట్టిన కిటికీ, తక్కిన ప్రపంచమంతా దానికి అవతల ....

కిటికీ తెరిచినపుడు నీవు ఎన్నెన్నో దర్శించాలని కలలు కని వుంటావు
కిటికీ తెరిచిన తరువాత చూసినది ఏదీ నీవు కలగన్నది కాదని తెలుసుకుంటావు 


పోర్చుగీసు మూలం: ఫెర్నాండో పెస్సోవ
ఇంగ్లీష్: రిచర్డ్ జెనిత్
తెలుగు: కోడూరి విజయకుమార్

కామెంట్‌లు లేవు: