మరొక తల్లి
తన
బలహీన గుండెల మీద
రెండు
చేతులతో కొట్టుకుంటూ రోదిస్తున్న ఒక తల్లి
ప్రాణమంతా
రెండు కళ్ళల్లో మిగిలిన ఒక అమాయక తల్లి
కొడుకు దేహం లోంచి చిలుక
ఎగిరిపోయిన
సత్యాన్ని ఇంకా జీర్ణించుకోని పిచ్చి తల్లి
సత్యాన్ని ఇంకా జీర్ణించుకోని పిచ్చి తల్లి
అనునయించే చేతులు, సముదాయించే
మాటలు
నిస్సహాయంగా ఆ తల్లి శోకం ముందు
2
నిస్సహాయంగా ఆ తల్లి శోకం ముందు
2
పిడికిళ్ళు
బిగించి, పళ్ళు నూరుతూ
కొడుకు మూర్చలు పోయిన పసితనపు రోజులలో
ఆ
తల్లి కళ్ళ దీపాలతో కాపలా కాసేది
జ్వరం తో దేహం వొనికిన అతడి పసితనం లో
కొడుకుని భుజానికి ఎత్తుకుని
జోరున కురిసే తుఫాను రాత్రుల్లో సైతం
డాక్టరు కోసం పరుగులు తీసేది
ఏడేడు కొండలెక్కీ , ఏడేడు రోజుల ఉపవాసాలు చేసీ,
కనిపించని ముక్కోటి దేవతలని
అతడి ప్రాణం గడప ముందు కాపలా పెట్టేది
ఇంతా చేసి, ఒకే ఒక చిన్న కోరిక ఆ తల్లిది
చివరి రోజుల్లో కొడుకు చేతి ముద్ద తినాలని
చివరాఖరున తన కొడుకు తల కొరివి పెట్టాలని
3
వీధి గాఢ నిద్రలోకి జారిన రాత్రులలో
ఇంటికి చేరే అతడి దేహం నుండి వీచే వాసనకి
ఆ తల్లి నిలువెల్లా కంపించేది
దేహాన్ని తూట్లు పొడిచే ఆ విష పదార్థాల
జోలికి వెల్లొద్దని బతిమిలాడుకునేది
అతడి పసి పాపనీ, అతడినే నమ్మి వొచ్చిన భార్యనీ
అతడి ముందు నిలిపి ప్రమాణాలు చేయించేది
అతడు రాత్రులు చేసిన ప్రమాణాలు
తెల్లవారగానే తెల్లారిపోయేవి
4
మత్తులో మునిగిన వాడికి
తల్లీ లేదు ... కట్టుకున్నదీ లేదు ... కన్నదీ లేదు
ఒక మాయా ప్రపంచపు వేటలో కొంత కాలం కనుమరుగై
ఒకనాడు తిరిగి తల్లిని చేరాడు... శిధిల దేహంతో
మరణించిన ఆశ యేదో తిరిగి చిగురించి,
ఆ ముసలి తల్లి కొడుకుని పొదుగుకుంది కడుపులో
వొణికే పల్చటి దేహంతో ఆ తల్లి
ఎక్కని గుడిమెట్లు లేవు ... ప్రార్థించని వైద్యులు లేరు ..
5
సుదూర తీరం నుండి పిలుపు వొచ్చిన రోజు
అతడు తన తల్లికి కన్నీళ్ళతో చేతులు జోడించాడు
యుక్త వయసు కూతురి చేతులు పట్టుకుని
'క్షమిస్తామని ఒక్క మాట చెప్పు తల్లీ' అని నిష్క్రమించాడు
6
అనునయించే చేతుల, సముదాయించే మాటల నడుమ
ఎడతెగని దుక్కం లో తడిసి, అలసి ఆ ముసలి తల్లి శపించింది
'మనుషులకు ఈ విషాన్ని అందించి
తల్లులకు కొడుకులు, పిల్లలకు తండ్రులూ
లేకుండా చేస్తోన్న ఈ రాజ్యానికి మా ఉసురు తగుల్తుంది'
ఆ శాపం వొట్టి పోదు .... తల్లుల శాపం తగలక పోదు !
(మా పెద్ద మేనత్తకూ.... ఆమె లాంటి తల్లులకూ)
[ప్రచురణ : వాకిలి- మార్చి - 2013]
------కోడూరి విజయకుమార్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి