ఏ సన్నాయి రాగమూ స్పర్శించని
వొంటరి గాలి తెమ్మెరలా
ఏ పరిచిత పలకరింపు కెరటమూ స్పృశించని
యేకాకి ప్రేక్షక నౌకలా
పచ్చని సందడి దృశ్యాలన్నీ కళ్ళ రెటీనాలపై
తడిసిన సన్నివేశంలో
నిలువెత్తు దుక్కాశ్రువు వై సమూహం లో నీవు
ఎందుకు ప్రేమించి వుంటావు?
2
ఎంత నిశ్శబ్ద ప్రవేశం
ఎంత నిర్దయ నిష్క్రమణ
తన ప్రవేశ, నిష్క్రమనల నడుమ
రంగుల ఇంద్రధనుసు నీ మనసు
అంతిమంగా
దుక్కించడానికి ప్రేమించి వుంటావు
3
అన్ని పేజీలనీ రంగుల కలలతో
నింపుకున్న డైరీ లో
మాటలు కరువైన ఖాళీతనంతో
చిట్ట చివరి పేజీ
బహుశా
నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవడానికే
తనని ప్రేమించి వుంటావు
--'వార్త ': 28 -12 -1999
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి